సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (09:16 IST)

ఐఆర్ఆర్ఐ శాస్త్రవేత్తకు అరుదైన గుర్తింపు.. ఏంటది?

swathi naiak
ఢిల్లీలోని ఐఆర్ఆర్ఐ శాస్త్రవేత్తకు అరుదైన గుర్తింపు లభించింది. ఆమె పేరు స్వాతి నాయక్. వరిసాగు చేసే చిన్న రైతులకు మేలు చేకూర్చే అనేక పరిశోధనలు చేసినందుకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ నార్మన్ బోర్లాగ్ అవార్డును ప్రకటించింది. 
 
ఒరిస్సాకు చెందిన డాక్టర్ స్వాతి నాయక్.. ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఆఐ)లో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకుగాను ఆమె ఈ అవార్డును దక్కించుకున్నారు. 
 
హరిత విప్లవ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత్ నార్మన్ ఇ బోర్లాగ్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. ఆకలిని నిర్మూలించి, ఆహార భద్రతకు కృషి చేసే 40 యేళ్లలోపు వయస్సున్న వ్యవసాయ శాస్త్రవేత్తలకు ప్రతి యేటా ఈ అవార్డును ప్రదానం చేస్తుంటారు. అందులో భాగంగా, ఈ యేడాది స్వాతి నాయక్‌కు ఈ పురస్కారం వరించింది.