మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2017 (12:53 IST)

ఇంట్లో కట్టెల పొయ్యి వెలిగిస్తున్నారా? అయితే జాగ్రత్త సుమా

మనదేశంలో వాతావరణ కాలుష్యం అమాంతం పెరిగిపోతోంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ, రసాయనాలతో ఏర్పడే కాలుష్యంతో పాటు ఇంట్లో వుపయోగించే కట్టెల పొగ కూడా ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఇంటి బయటే కాదు.. ఇంట్లోనూ

మనదేశంలో వాతావరణ కాలుష్యం అమాంతం పెరిగిపోతోంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ, రసాయనాలతో ఏర్పడే కాలుష్యంతో పాటు ఇంట్లో వుపయోగించే కట్టెల పొగ కూడా ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఇంటి బయటే కాదు.. ఇంట్లోనూ అదే స్థాయిలో కాలుష్యం ఏర్పడుతోంది. కంటికి కన్పించని ఆ కాలుష్య మహమ్మారి అనేక ప్రాణాలను బలితీసుకుంటోంది. 
 
ఇంట్లో ఉపయోగించే కట్టె పొయ్యిల ద్వారా 2015లో మనదేశంలో ఐదులక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కట్టెలు, బొగ్గువంటి ఘనపదార్థాలను మండించడం ద్వారా ఏర్పడే కాలుష్యంతో ఊపిరితిత్తులు, రక్తకణాలు దెబ్బతింటాయని మెడికల్ జర్నల్ లాన్సెంట్ పేర్కొంది. 
 
వెంట్రుకల పరిమాణం కంటే మూడు రెట్లు చిన్నగా వుండే సీఓ2 లేదా కార్బన్ డై యాక్సిడ్ అనే ఈ కాలుష్యకారకం సులభంగా ఊపిరితిత్తుల్లో కలిసిపోతుందని వైద్యులు అంటున్నారు. ఇలా కట్టెల పొయ్యితో ఏర్పడిన కాలుష్యం ద్వారా 2015లో మాత్రం ఐదులక్షల మంది మృతి చెందారని మెడికల్‌ జర్నల్‌ లాన్సెంట్‌ జాబితాలో వెల్లడి అయ్యింది. 
 
గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇంకా వంట కోసం కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో ఏర్పడే కాలుష్యం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.