గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: ఆదివారం, 15 అక్టోబరు 2017 (20:31 IST)

వదలి వెళ్ళొద్దంటూ 23 లక్షల మంది సాయి పల్లవికి సందేశాలు....

ఒక్క సినిమాతో టాప్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోయిన సాయి పల్లవి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమను వదిలేయడానికి సిద్ధమవుతోందనే రూమర్ వినబడుతోంది. తెలుగు సినిమాల్లో ఫిదా తరువాత అలాంటి కథలు తనకు రావడం లేదని, అందువల్లే సినీ పరిశ్రమలను వదిలేయాలన్న నిర్ణయానికి

ఒక్క సినిమాతో టాప్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోయిన సాయి పల్లవి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమను వదిలేయడానికి సిద్ధమవుతోందనే రూమర్ వినబడుతోంది. తెలుగు సినిమాల్లో ఫిదా తరువాత అలాంటి కథలు తనకు రావడం లేదని, అందువల్లే సినీ పరిశ్రమలను వదిలేయాలన్న నిర్ణయానికి సాయి పల్లవి వచ్చేసిందట. ఓయ్ పిల్లగాడ.. సినిమాలో నటిస్తున్న పల్లవి ఆ తరువాత సినీ పరిశ్రమలను వదిలేస్తున్నట్లు ఆమె స్నేహితులే చెబుతున్నారు.
 
ప్రస్తుతం సాయిపల్లవి పరిశ్రమను వదిలి వెళ్ళిపోతోందనేదే హాట్ టాపిక్‌గా మారింది. తనకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్‌తో పాటు నటించే సినిమా హిట్ అయ్యి తీరాలన్నదే పల్లవి ఆలోచన. అందుకే సాయి పల్లవి చాలా ఆలస్యంగానే సినిమాలను చేస్తోంది. కథ నచ్చడం, ఆ కథలో తన పాత్ర ఎలా ఉందో చూసుకోవడం ఇదంతా చేసిన తరువాతనే సాయిపల్లవి మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నారు. 
 
అయితే తనకు సినిమాల్లో స్థిరపడేలా చూపిన తెలుగు సినీపరిశ్రమనే ఆమె వదిలి వెళ్ళాలనుకోవడం మాత్రం చాలామందికి అస్సలు ఇష్టం లేదు. ఈ విషయం కాస్త అభిమానులకు అలా.. అలా చేరి ఫేస్ బుక్, ట్విట్టర్లలో సాయిపల్లవి పేజ్‌లో అభిమానులు వెళ్ళొద్దంటూ పోస్టింగ్‌లు చేస్తున్నారు. అయితే పల్లవి మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. తాను అనుకున్నదే ఖచ్చితంగా చేయాలన్నది పల్లవి ఆలోచనగా వుందంటున్నారు.