శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (10:59 IST)

ఢిల్లీలో కొనసాగుతున్న త్రీవ వాయుకాలుష్యం

వరుసగా మూడో రోజు ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతున్నది. సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రకారం.. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 432కు చేరింది.

దీపావళి రోజున శుక్రవారం గాలి నాణ్యత సూచీ 642కు చేరింది. ఇదిలా ఉండగా.. దీపావళి పండుగ తర్వాత గడిచిన ఐదేళ్లలో తొలిసారిగా వాయుకాలుష్యం కాస్త తక్కువగా ఉన్నది. అయితే పొరుగు రాష్ట్రాల్లో పంటల వ్యర్థాలను తగులబెట్టే సంఘటనలు పెరిగాయి.
 
గాలి అధిక వేగంగా కారణంగా ఏక్యూఐ 449కి చేరి కాస్త మెరుగుపడింది. ఆదివారం ఉదయం 436కు చేరగా.. సాయంత్రానికి మరింత మెరుగైంది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వాయు కాలుష్యానికి సంబంధించిన డేటాను ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌, నోయిడా, గురుగ్రామ్‌లోనూ కాలుష్య స్థాయి ఆందోళనకరంగా ఉన్నది. నోయిడాలో ప్రమాదకర కేటగిరిలో గాలి నాణ్యత సూచీ 575, గురుగ్రామ్‌లో 478 వద్ద ఉన్నది.