సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ఎమర్జెన్సీ డోర్ పక్కనే కూర్చొన్న ప్రయాణికుడు.. దాన్ని తెరిచేందుకు యత్నం...!

indigo
అత్యవసర ద్వారం వద్ద కూర్చొన్న ఒక ప్రయాణికుడు విమానం టేకాఫ్ సమయంలో దాన్ని తెరిచేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన నాగ్‌పూర్ - బెంగుళూరు మధ్య తిరిగే ఇండిగో విమానంలో గత నెల 30వ తేదీన జరిగింది. విమానం టేకాఫ్‌కు ముందు ఆ ప్రయాణికిడు ఈ దుస్సాహసానికి యత్నించాడు. దీన్ని గమనించిన సహ ప్రయాణికులు, సిబ్బంది విమానం ల్యాండ్ అయిన తర్వాత అతన్ని విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. 
 
పోలీసుల కథనం మేరకు.. స్విప్నిల్ హాలీ అనే వ్యక్తి 6ఈ6803 అనే నంబరు కలిగిన ఇండిగో విమానంలో నాగ్‌పూర్ నుంచి బెంగుళూరు గత నెల 30వ తేదీన బయలుదేరాడు. అతనికి అత్యవసర ద్వారం పక్కనే సీటు లభించింది. అయితే, విమానం టేకాప్ ముందు సిబ్బంది ఇతర ప్రయాణికులు బిజీబిజీగా ఉండగా స్వప్నిల్ మాత్రం ఆ తలుపు తెరిచేందుకు ప్రయత్నం చేసాడు. ఇది చూసిన ఇతర ప్రయాణికులు, విమాన సిబ్బంది, అతన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత విమానం బెంగుళూకురు చేరుకున్న తర్వాత ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. 
 
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ  
 
గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా తనపై పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసును కొట్టి వేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది సారథ్యంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేట్టనుంది. సర్వోన్నత న్యాయస్థానంలోని ఆరో నంబరు కోర్టులో ఐటం నంబర్ 63గా ఈ కేసు లిస్ట్ చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటులో రూ.272కోట్ల అవినీతి జరిగిందంటూ వైకాపా ప్రభుత్వం కేసు పెట్టి చంద్రబాబును అరెస్టు చేసి  రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా బంధించింది. అయితే, తనపై అక్రమంగా కేసు పెట్టారనీ, దీన్ని కొట్టి వేయాలంటూ కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బాబు తరపున సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. అలాగే, క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టే సమయంలో తమ వాదనలు కూడా వినాలని కోరుతూ ఏపీ సీఐడీ పోలీసులు కేవియట్ రిట్‌ను దాఖలు చేసిన విషయం తెల్సిందే.