1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (08:59 IST)

మంగళసూత్రాన్ని మింగేసి గేదె... ఆ తర్వాత ఏం జరిగిందంటే...

buffalo
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. రెండున్నర లక్షల రూపాయల విలువు చేసే మంగళసూత్రాన్ని ఓ గేదె మింగేసింది. దీన్ని ఆ గేదె యజమానురాలు సకాలంలో గుర్తించి వెంటనే స్పందించడంతో భారీ నష్టం తప్పింది. ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. జిల్లాలోని సారసి అనే గ్రామంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన రాంహరి అనే వ్యక్తి భార్య మంగళసూత్రాన్ని తీసి సాయాబీన్ తొక్కలు ఉన్న ప్లేట్‌లో పెట్టి స్నానానికి వెళ్లింది. స్నానం చేసిన అనంతరం తిరిగి మంగళసూత్రాన్ని ధరించడం మరిచిపోయింది. ఇంటి పనుల్లో పడి తన మంగళసూత్రం విషయమే మరిచిపోయింది. అలా మూడు గంటలు సమయం గడిచిపోయింది. ఆ తర్వాత తన మెడలో మంగళసూత్రం లేదనే విషయాన్ని గుర్తించి.. దానికోసం వెతికింది. చివరకు తన మంగళసూత్రం సోయాబీన్ తొక్కలు ఉన్న ప్లేట్‌లో ఉంచినట్టు గుర్తుకు తెచ్చుకుని అక్కడకు వెళ్లి చూసింది. ఆ తట్టులోని సోయాబీన్ తొక్కలతో పాటు మంగళసూత్రం కూడా కనిపించలేదు. 
 
దీంతో తన భర్తతో పాటు పశువుల వైద్యుడికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. వెంటనే అక్కడకు చేరుకున్న వైద్యుడు.. మెటల్ డిటెక్టర్‌తో గేదె కడుపులో మంగళసూత్రం ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి మంగళసూత్రాన్ని వెలిగి తీశాడు. గేదె పొట్టకు ఏకంగా 65 కుట్లు వేశాడు. ఈ మంగళసూత్రం ధర రూ.2.50 లక్షల వరకు ఉంటుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించడంతో పాటు నవ్వులు కూడా తెప్పించింది.