శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2023 (14:11 IST)

కార్ పూలింగ్‌పై నిషేధం విధించిన కర్నాటక సర్కారు...

carpooling
కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్ పూలింగ్‌పై నిషేధం విధించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేక వస్తుంది. బెంగుళూరు జనభా అవసరాలకు తగిన విధంగా బస్సులు లేవని బీజేపీ ఎంపీ భార్య అంటున్నారు. అందువల్ల రైడ్ షేరింగ్, కారు పూలింగ్‌కు తక్షణం పరిష్కార మార్గం చూపించాలని కోరుతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ కూడా కారు పూలింగ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు. 
 
మరోవైపు కారు పూలింగ్‌కు పాల్పడితే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు నిషేధం విధిస్తామని కర్నాటక ప్రభుత్వం హెచ్చరించింది. ఒక వాహనాన్ని సొంత అవసరాల కోసం వినియోగిస్తే దానికి పన్ను చాలా తక్కువగా ఉంటుంది. అదే రవాణాకు వినియోగిస్తే ప్రత్యేక పన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే, చాలామంది కర్నాటక వాసులు సొంత అవసరాలకు వాహనాన్ని కొనుగోలు చేసి వైట్ బోర్డుతో వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. దీన్ని కర్నాటక ప్రభుత్వం నిషేధించింది. 
 
అయితే, ప్రస్తుతం బెంగుళూరు జనాభాకు తగిన విధంగా రవాణా సౌకర్యాలు లేవని, అందువల్ల కారు పూలింగ్‌కు అనుమతించాలని బెంగుళూరు ఎంపీ తేజస్వీ సూర్య ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఓ లేఖ రాశారు. రహదారులపై వాహనాల రద్దీని తగ్గించేందుకు కారు పూలింగ్ ఓ పరిష్కార మార్గమని పేర్కొన్నారు. 
 
పట్టణంలో ప్రజా రవాణాను పరిశీలిస్తే బీఎంటీసీ గత కొన్ని సంవత్సరాలుగా 4500 బస్సులను నడుపుతుంది. వాటి సంఖ్య ఇపకుడు 6763కు చేరింది. బెంగుళూరులో జనభా 1.10 కోట్లకు చేరింది. వీరి అవసరాలు తీర్చేందుకు మరో ఆరు వేల బస్సులు కావాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రైడ్ షేరింగ్, కారు పూలింగ్‌కు తక్షణ పరిష్కారం అవుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.