గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (09:28 IST)

కర్ణాటక.. 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారా?

Karnataka Election results
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక శనివారం సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణ జరగనుంది. 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నెల 20న సిద్ధూ, డీకేతో పాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. 
 
వీరిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఉన్నారు. అయితే మంత్రులకు శాఖలను కేటాయించలేదు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రివర్గ విస్తరణ పూర్తి అయిన తర్వాత శాఖలను కేటాయించే అవకాశం వుంది. 
 
ఇప్పటికే సిద్ధూ, డీకే ఇద్దరూ ఢిల్లీలో ఉన్నారు. మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలనే విషయంపై హైకమాండ్‌తో చర్చించి తుది జాబితాను విడుదల చేయనున్నారు.