శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (12:23 IST)

తమిళ ప్రజలు ఓట్లు వేసింది 'మన్నార్గుడి మాఫియా'కు కాదు జయలలితకు : ఎంకే.స్టాలిన్

తమిళ ప్రజలు ఓట్లు వేసింది మన్నార్‌గుడి మాఫియాకు కాదనీ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలలితకు అని డీఎంకే కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎంకే.స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎ

తమిళ ప్రజలు ఓట్లు వేసింది మన్నార్‌గుడి మాఫియాకు కాదనీ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలలితకు అని డీఎంకే కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎంకే.స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో గంటగంటకూ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అజెండా ప్రకటించకుండా శాసనసభా పక్ష సమావేశానికి పిలుపునివ్వడంతో మొదలైన అలజడి.. శశికళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారన్న వార్తలతో పతాకస్థాయికి చేరింది. 
 
ఎమ్మెల్యేలను చీల్చడం ద్వారా శశికళకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం షాకిచ్చారని, జయలలిత మేనకొడలు దీపకు కూడా కొందరు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని, రెండాకుల పార్టీ మూడు ముక్కలైందని.. ఆదివారం ఉదయం నుంచి రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిణామాలపై విపక్ష డీఎంకే ఘాటుగా స్పందించింది. 
 
తమిళనాడు ప్రతిపక్షనేత, డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.కె.స్టాలిన్‌ స్పందించారు. అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుట్టు చెప్పారు. శశికళనుకానీ, జయలలిత ఇతర కుటుంబసభ్యులనుకానీ ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరించరని అభిప్రాయపడ్డారు. ‘గత ఎన్నికల్లో తమిళ ప్రజలు ఓటేసింది జయలలితకేకానీ, ఆమె కుటుంబసభ్యులకు కాదు. కాబట్టి శశికళనో, మరొకరినో సీఎంగా ప్రజలు ఒప్పుకోరు’ అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.