పౌరులకు చేసే సహాయంపై తప్పుదారి పట్టించే నివేదికలపై Kooలో PIB ఫ్యాక్ట్ చెక్
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రతి పౌరునికి రూ.30, 638 అందజేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నదంటూ ఇటీవలి సందేశం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సందేశాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ద్వారా పరిశోధించింది. వారు సందేశాన్ని 'నకిలీ' అని పిలిచారు, ఇటువంటి తప్పుదారి పట్టించే సమాచారం పట్ల జాగ్రత్త వహించమని పౌరులను హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ అటువంటి సహాయాన్ని ప్రకటించలేదని మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ 'కూ'పై PIB ఫాక్ట్ చెక్ స్పష్టం చేసింది. దేశంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలవారీ భత్యం రూ.3500 ఇవ్వడంపై తాజాగా మరో క్లారిటీ వచ్చిన నేపథ్యంలో PIB ఫ్యాక్ట్ చెక్ నుండి ఈ స్పష్టత వచ్చింది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఈ మెసేజ్ కూడా ఫేక్ అని ప్రకటించింది.
PIB ఫాక్ట్ చెక్ నుండి Kooపై రెగ్యులర్ క్లారిఫికేషన్‌లు నకిలీ వార్తలను విశ్వసించే, వాటి బారిన పడే అవకాశం ఉన్న వినియోగదారులకు భరోసా ఇవ్వడానికి సహాయపడుతున్నాయి.