జల్లికట్టుకు మళ్లీ కష్టాలు.. సుప్రీంలో పిటిషన్ దాఖలు.. 30న విచారణ..
జల్లికట్టుపై తమిళ తంబీలు పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. జల్లికట్టులో ఎద్దుల పొగరును అణచివేసే క్రమంలో అనేకమంది మరణిస్తున్న తరుణంలో ఆ క్రీడపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. తమ సంప్రదాయంగా
జల్లికట్టుపై తమిళ తంబీలు పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. జల్లికట్టులో ఎద్దుల పొగరును అణచివేసే క్రమంలో అనేకమంది మరణిస్తున్న తరుణంలో ఆ క్రీడపై సుప్రీం కోర్టు నిషేధం విధించింది. తమ సంప్రదాయంగా వస్తోన్న జల్లికట్టు క్రీడ నిర్వహించకుండా సుప్రీం విధించిన తీర్పు సరికాదని.. తమిళులు ఇటీవలే భారీ ఎత్తున పోరాటం చేసి పలు చోట్ల విధ్వంసాలకు పాల్పడిన సంగతి తెలిసిందే.
శాంతియుతంగా ఏడు రోజుల పాటు జరిగిన జల్లికట్టు ఉద్యమంలో సోమవారం విధ్వంసం చోటుచేసుకుంది. పోలీసులు ఓవరాక్షన్‌తో విద్యార్థులు రెచ్చిపోయారు. పోలీసులే ఈ విధ్వంసానికి కారణమని.. ఇందుకు విద్రోహ శక్తులతో పాటు విద్యార్థులు కారణమని చెప్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కానీ ఇప్పటికే తమిళ సర్కారు జల్లికట్టు క్రీడ నిర్వహించడానికి వీలుగా ఆర్డినెన్స్ జారీ చేసి, ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి చట్టంగా రూపొందించింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జంతు సంరక్షణ బోర్డు(యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా- ఏడబ్ల్యూబీఐ) తో పాటు ఇతర సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారించిన సుప్రీంకోర్టు బుధవారం వాటిని విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. అంతేగాకుండా ఈ నెల 30న జల్లికట్టు వ్యతిరేక పిటిషన్లు అన్నింటినీ ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.