బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (13:52 IST)

రుద్రాక్షమాలతో మంత్రపఠనం చేస్తూ త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం (Video)

narendra modi holy dip
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుణ్యస్నానం ఆచరించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ‌్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్న ఆయన త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం చేశారు. బుధవారం ఉదయం ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్న ప్రధాని మోడీ... ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి త్రివేణి సంగమానికి వెళ్లారు. 
 
అక్కడ అరైల్ ఘాట్ నుంచి బోటులో సంగం ఘాట్‌కు చేరుకున్నారు ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగిని అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ప్రధాని మోడీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ త్రివేణి సంగమంలో స్నానమాచరించారు.