శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (10:13 IST)

కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ కాసేప‌టి క్రిత‌మే చార్‌ధామ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మైన‌ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ రోజు ఉద‌యం 7 గంటల ప్రాంతంలోనే ఆల‌యానికి ప్ర‌ధాని మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంచ్‌దార్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
 
అనంత‌రం ప్రధాని మోదీ కేదార్నాథ్ ఆలయానికి వ‌చ్చారు. ఈ ఆలయంలో కూడా మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మం త‌ర్వాత కొత్తగా నిర్మించిన సద్గురు ఆది శంకరాచార్యుల సమాధిని ప్ర‌ధాని మోడీ ప్రారంభిస్తారు. దీని త‌ర్వాత ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
 
ఈ కార్య‌క్ర‌మాల త‌ర్వాత ఉత్త‌రఖాండ్ రాష్ట్రం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అలాగే ప‌లు ప‌నుల‌కు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే కేధ‌ర్ నాథ్ లో స‌ర‌స్వ‌తి ఘాట్ ను ప్రారంభిస్తారు. అలాగే 130 కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులను కూడా ప్ర‌ధాని మోడీ ప్రారంభిస్తారు.