గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 నవంబరు 2021 (11:02 IST)

ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవం : శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబరు ఒకటో తేదీని అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. ఏపీ ప్రజలు నైపుణ్యం, ధృడ సంకల్పం, పట్టుదలకు మారుపేరని కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. 
 
'ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్‌ చేశారు. అలాగే కర్ణాటక రాజ్యోత్సవం, కేరళ పిరవి ఉత్సవాల సందర్భంగా ప్రధాని ఆయా రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.