సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మే 2023 (23:02 IST)

మే 14 సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 144 జారీ.. ఎక్కడ?

144
144
కర్ణాటకలో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. మంగళూరులోని మూడుశెట్టె ప్రాంతంలో పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మధ్య బుధవారం రాత్రి ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఒక పోలీసు సహా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఈ ఘర్షణ తర్వాత, నగరంలో కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఐదు పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రాంతంలో సెక్షన్ 144 జారీ చేయబడింది. మే 14 సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధాజ్ఞ అమలులో ఉంటుందని సమాచారం.