ఆదివారం, 26 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (22:44 IST)

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పూనమ్ కౌర్ ఏం చెప్పిందంటే? (video)

poonam kaur
అబార్షన్ల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సినీ నటి పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్లు చేసింది. సుప్రీం నిర్ణయంపై ఆమె సానుకూలంగా స్పందించింది. 
 
ఈ మధ్యకాలంలో అమ్మాయిలకు ఇష్టం లేకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయని వారికి ఇష్టం లేకుండానే గర్భవతులు అవుతున్నారని చెబుతోంది. 
 
"ఎంతోమంది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని ఇష్టం లేకుండానే గర్భవతులయ్యి ఆర్థికంగా సెక్యూరిటీ కోసం భర్తతో ఉండే వాళ్ళని చాలామందిని చూశాను. అసలు మగాళ్లు ఆడవాళ్లను కేవలం పిల్లలని కనే మెషిన్ లాగా చూడకూడదు," అని షాకింగ్ కామెంట్స్ చేసింది పూనమ్ కౌర్. ప్రస్తుతం పూనమ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.