శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (12:59 IST)

నీరు తాగడం మంచిది... శరీరానికి మెదడుకు మేలు చేస్తుంది : ప్రశాంత్ కిషోర్

prashanth kishore
నీరు తాగడ మంచిదని, శరీరానికి, మెదడుకు ఎంతో మేలు చేస్తుందని జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆయన అంచనాలను అనేక మంది తప్పుబడుతున్నారు. ఇలాంటి వారికి కౌంటరిచ్చేలా ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. 
 
'నా ఎన్నికల అంచనాల నేపథ్యంలో, ఫలితాలు ఎలా వస్తాయోనని గిజగిజలాడుతున్న వారు జూన్ 4వ తేదీన తాగేందుకు సమృద్ధిగా నీటిని అందుబాటులో ఉంచుకోవాలని వ్యంగ్యం ప్రదర్శించారు. 2021 మే 2న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకోవాలి" అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
 
తాజాగా ఆయన ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వాడీవేడిగా సాగింది. మీరు హిమాచల్ ప్రదేశ్ విషయంలో వెలువరించిన అంచనాలు దారుణంగా తప్పాయి కదా అని కరణ్ థాపర్ ప్రశ్నించగా... నేను హిమాచల్ ప్రదేశ్ విషయంలో అంచనాలు వెలువరించినట్టు వీడియో సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని పీకే ప్రశ్నించారు.
 
ఈ క్రమంలో, ప్రశాంత్ కిశోర్ గ్లాసు నీళ్లను గడగడా తాగేసినట్టు ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఫొటోతో సహా ప్రస్తావించాడు. ప్రశాంత్ కిశోర్ నీరుగారిపోయాడు అనే అర్థం వచ్చేలా ఆ నెటిజన్ వ్యాఖ్యానించాడు. దీనిపైనే ప్రశాంత్ కిశోర్ పై విధిందా స్పందించినట్టు తెలుస్తుంది.