ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (13:05 IST)

అధికారం వచ్చిన గంటలోనే మద్యపాన నిషేధం ఎత్తివేస్తా.. ప్రశాంత్ కిషోర్

prashant kishore
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న తన కొత్త పార్టీ జన్ సూరజ్ పార్టీని ప్రారంభించి అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. ఈ మేరకు ఆయన సంచలన ప్రకటన చేశారు.  బీహార్ మద్య నిషేధానికి సంబంధించి వాగ్ధానం చేశారు. 
 
బీహార్‌లో జన్ సూరజ్ ప్రభుత్వం ఏర్పడితే, తాము ఒక గంటలో మద్య నిషేధాన్ని అంతం చేస్తాం  అని కిషోర్ ప్రకటించారు. గత రెండేళ్లుగా తన పార్టీ ఆవిర్భావానికి సిద్ధమవుతున్నానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ (యునైటెడ్), ఆర్జేడీని ఓడించడం ఖాయమని పీకే పేర్కొన్నారు.
 
 
 
ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌లను కిషోర్ విమర్శిస్తూ, జేడీయూ, ఆర్జేడీ 30 ఏళ్లుగా అధికారాన్ని పంచుకున్నప్పటికీ, బీహార్ అభివృద్ధి చెందలేదు. రెండు పార్టీలు పక్కకు తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
 
 
 
2016లో విధించినప్పటి నుండి, బీహార్‌లో మద్యపాన నిషేధం అక్రమ మద్యం వినియోగం పెరగడానికి దారితీసింది. ఫలితంగా అనేక మరణాలు సంభవించాయి. నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పుకొచ్చారు. అందుకే రాష్ట్రంలో జన్ సూరజ్ ప్రభుత్వం అధికారంలో వస్తే గంటలోనే మద్యపానంపై నిషేధాన్ని ఎత్తివేస్తామని పీకే అన్నారు.