బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 నవంబరు 2020 (08:36 IST)

తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తుపాను తీవ్రత తగ్గేవరకు  పైన సూచనలు పాటించాల్సింది‌గా‌ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. 
 
తప్పనిసరిగా వీలైనంత  వరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. 
మీ ఇల్లు సురక్షితంకాకపోతే ముందే సురక్షితమైన ఆశ్రయం/షెల్టరుకు చేరుకోండి.
భారీ వర్షాలతో కూడిన ఈదురుగాలులు వీస్తున్నప్పుడు తలుపులు మరియు కిటికీలను సురక్షితంగా మూసివేయండి.
అదే విధంగా ఇంట్లో వస్తువులు కదలకుండా ఉండేవిధంగా తగుజాగ్రత్తలు తీసుకోండి. అవి మీద పడే‌ అవకాశం ఉంటుంది.
వాతావరణ హెచ్చరికలను గమనిస్తు ఉండండి. రేడియో/టీవీన్యూస్  చూడండి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లకు ఫోన్ చేసి పునరావాస కేంద్రాలు, ఇతర  సమాచారం గురించి తెలుసుకోండి.
పుకార్లను నమ్మవద్దు, ప్రశాంతంగాఉండండి, భయపడవద్దు.
భద్రత  మరియు మనుగడ కోసం అవసరమైన వస్తువులతో "అత్యవసర వస్తుసామగ్రిని" సిద్ధంచేసుకోండి.
ప్రభుత్వ అధికారులు సూచించిన వెంటనే సురక్షితమైనప్రదేశాలకు వెళ్ళండి. 
వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు త్రాగడం మంచిది.
భవనం కూలిపోవటం జరుగుతుంటే బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే దుప్పట్లు, రగ్గులతో కప్పుకుని బలమైన టేబుల్/ బెంచి క్రిందకు  దూరడం ద్వారా మిమ్మల్నిమీరు రక్షించుకోవచ్చు.
దెబ్బతిన్న/పాతభవనాల్లోకి ప్రవేశించవద్దు. వీలైనంత త్వరగా సురక్షితమైన ఆశ్రయం/షెల్టరుకు చేరుకొండి.
వాతావరణం ప్రశాంతంగా ఉంటే జాగ్రత్తగా నిశితంగా వేచిచుడండి, ఒక్కసారిగా పెద్ద/హింసాత్మక గాలులు మరొక దిశ నుండి తిరిగి ప్రారంభమవచ్చు, తుపాను తీవ్రత తగ్గినట్టు అధికారిక సమాచారం వచ్చెంత వరకు సహనంతో ఉండండి.