శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (13:43 IST)

రెడీ టు అటాక్... ఆదేశాల కోసం వెయిటింగ్: భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత వైమానిక దళాధిపతి బీఎస్.ధనోవా వెల్లడించారు. తాము ప్రభుత్వ ఆదేశాల కోసం వేచిచూస్తున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆదేశిస్తే ఏ క్షణమైనా పాకిస్థాన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో 'వాయుశక్తి-2019' వైమానిక విన్యాసాలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వాయుసేన శక్తి సామర్థ్యాలను చాటిచెప్పేలా శత్రువుకు గట్టి జవాబు చెప్పేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. భారత్‌ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, పరోక్షదాడులకు పాల్పడుతోందంటూ పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.