రేసింగ్ అభిరుచి గల బాలుడికి సైకిల్ కొనిచ్చిన రాష్ట్రపతి కోవింద్

President
వి| Last Modified శుక్రవారం, 31 జులై 2020 (16:47 IST)
లక్ష్యసాధనకు ప్రోత్సాహం అవసరం. ఢిల్లీకి చెందిన రియాజ్ అనే బాలుడు సైకిల్ రేసింగ్‌లో ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటూ ప్రతి రోజు విద్యతో పాటు రేసింగ్ ప్రాక్టీసు చేస్తున్నాడు. రియాజ్‌కు చాంపియన్‌గా నిలవాలనే కోరిక. దీంతో కఠోర సాధన చేస్తున్నాడు. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆ బాలుడికి రేసింగ్ సైకిల్‌ను కానుకగా కొని ఇచ్చారు.

రియాజ్ ఢిల్లీ లోని సూర్యోదయ బాలవిద్యాలయంలో 9వ తరగతి చదువుతున్నాడు. రియాజ్ ఒకవైపు చదువుకుంటూ మరోవైపు రేసింగ్‌కు అవసరమైన డబ్బు కోసం హోటల్లో పనిచేస్తున్నాడు. ఈ విషయం రాష్ట్రపతి దృష్టికి వచ్చింది. దీనితో రాష్ట్రపతి ఆ బాలుడికి అతి ఖరీదైన రేసింగ్ సైకిల్ కొని ఇచ్చి ప్రోత్సహించి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశీర్వదించారు.
దీనిపై మరింత చదవండి :