మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (10:34 IST)

మాజీ ప్రధాని వాజ్‌పేయి తృతీయ వర్థంతి : ఘనంగా నివాళులు

దేశ మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి మూడో వర్థంతి వేడుకలు ఆగస్టు 16వ తేదీన జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు.
 
ఢిల్లీలోని అటల్‌ సమాధి స్థల్‌లో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్‌పేయి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. హోం మత్రి అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు.
 
ప్రధానిగా పూర్తి పదవీ కాలం పూర్తిచేసిన తొలి కాంగ్రెసేతర నేతగా వాజ్‌పేయి నిలిచారు. 1924, డిసెంబర్‌ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించిన వాజ్‌పేయి.. 2018, ఆగస్టు 16న మృతిచెందారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన తొలి నాయకుడు వాజ్‌పేయి కావడం గమనార్హం.