గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (12:19 IST)

ఉత్తరప్రదేశ్‌లో నమాజ్ చేసిన స్కూల్ విద్యార్థులు- ప్రిన్సిపాల్

ramzan
ఉత్తరప్రదేశ్‌లో స్కూల్ విద్యార్థులు నమాజ్ చేయడం వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. లక్నోలోని స్కూలులో నమాజ్ చేస్తున్న విద్యార్థుల వీడియో వైరల్ కావడంతో ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు ఉపాధ్యాయులకు వార్నింగ్ ఇచ్చింది. 
 
ఇంకా హిందూ సంఘాల నిరసనలతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించడం జరిగింది. నేపియర్ రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో కొందరు చిన్నారులు నమాజ్ చేశారు. 
 
ఇది మార్గదర్శకాలకు వ్యతిరేకం. ఈ ఘటనను బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దినేష్ కటియార్ విచారించారని ఉపాధ్యాయులు తెలిపారు.