శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (11:28 IST)

ముంబయిలో ప్రైవేటు వ్యాక్సినేషన్‌ సెంటర్లు మూత

మహారాష్ట్రలో కోవిడ్‌ వ్యాక్సిన్ల కొరత కారణంగా సోమవారం వరకు ముంబయిలోని ప్రైవేటు వ్యాక్సినేషన్‌ సెంటర్లను మూసివేయనున్నట్లు బృహన్‌ ముంబయి కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. అయితే ప్రభుత్వ, మున్సిపల్‌ ఆసుపత్రుల్లో యథావిధిగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.

'కోవిడ్‌ వ్యాక్సిన్‌ సరఫరా లేనందున, ఏప్రిల్‌ 10 నుండి 12 వరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌ సెంటర్లలో టీకాలు అందుబాటులో ఉండవు' అని ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, ముంబయి కార్పొరేషన్‌కు శుక్రవారం రాత్రికి వ్యాక్సిన్లు చేరుకునే అవకాశాలున్నాయని... తిరిగి టీకా ప్రక్రియను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. '99 వేల కోవిషీల్డ్‌ మోతాదులు చేరుకుంటాయి.

శనివారం ఉదయం మున్సిపల్‌, ప్రభుత్వ కేంద్రాల్లో పంపిణీ చేస్తాం' అని అదనపు మున్సిపల్‌ కమిషనర్‌ సురేష్‌ కాకాని తెలిపారు. శనివారం రెండు సెషన్‌లో వ్యాక్సిన్లను వేయనున్నట్లు తెలిపారు.

మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటల అందుబాటులో ఉంటాయని చెప్పారు. లబ్ధిదారులకు ఆదివారం ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు టీకాలు తీసుకోవచ్చునని పేర్కొన్నారు.