శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (19:51 IST)

రాహుల్ యాత్ర: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రియాంకా గాంధీ..

priyanka gandhi
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. రాహుల్‌ తలపెట్టిన యాత్రలో పాల్గొనేందుకు ప్లాన్‌ చేస్తుండగా ప్రియాంక గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో శుక్రవారం జరిగే పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరడం లేదని చెప్పారు.
 
రాహుల్ గాంధీ నేతృత్వంలోని యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ప్రవేశించింది. యాత్ర బీహార్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత ప్రియాంక ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో తన సోదరుడితో చేరాల్సి ఉందని వర్గాలు తెలిపాయి.
 
అయితే ఆమె ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్రకు రాహుల్ నాయకత్వం వహిస్తున్నారు. యాత్ర ప్రస్తుతం బీహార్ మీదుగా సాగుతోంది. ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు, ఆ తర్వాత మళ్లీ ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు ఈ యాత్ర రాష్ట్రంలో ప్రయాణిస్తుంది.