శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 జులై 2024 (11:31 IST)

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్ ఆడి కారు సీజ్!

audi car
మహారాష్ట్రలో వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిగా ముద్రపడిన పూజా ఖేద్కర్‌కు చెందిన ఆడి కారును పూణె పోలీసులు సీజ్ చేశారు. మోటారు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించి, కారుపై బ్లూకలర్ బీకాన్ ఏర్పాటు, వీఐపీ నంబర్ ప్లేట్, 'మహారాష్ట్ర ప్రభుత్వం' అని స్టిక్కర్ అంటించుకోవడం వంటి చర్యలకు పాల్పడినందుకు కారును సీజ్ చేయడంతో పాటు రూ.26 వేల అపరాధం కూడా విధించారు. 
 
పైగా, ఆమె ట్రైనీ ఐఏఎస్‌గా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే ఏకంగా 21 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు రూ.26 వేల జరిమానా కూడా విధించారు. ట్రాఫిక్ విభాగం నోటీసులు జారీచేయడంతో శనివారం రాత్రి ఖేద్కర్ కుటుంబ డ్రైవర్ కారు తాళాలు తీసుకెళ్లి చతుష్రంగి ట్రాఫిక్ పోలీస్ స్టేషనులో అప్పగించాడు. కారుకు సంబంధించిన పత్రాలు ఇంకా తమకు అందలేని పోలీసులు తెలిపారు. 34 ఏళ్ల పూజ ఖేద్కర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం, దురుసు ప్రవర్తన, యూపీఎస్సీ ఎంపికలో అక్రమాలకు పాల్పడడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.