ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 జులై 2024 (08:41 IST)

రైల్వే బ్రిడ్జిపై ఫోటోషూట్.. రైలు రావడంతో కిందికి దుకేసిన భార్యాభర్తలు (Video)

rail bridge
రాజస్థాన్ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిచ్చి పీక్ స్టేజీ చేరడంతో ఈ ఘటన జరిగింది. ఫోటో షూట్ కోసం రైలు వంతెనపై నిలబడిన ఓ జంటకు ఊహించని షాక్ ఎదురైంది. తాము ఫోటో షూట్‌లో నిమగ్నమైవుండగా ఓ రైలు దూసుకొచ్చింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు రైలు వంతెనపై నుంచి కిందకు దూకేశారు. దాదాపు 90 అడుగుల లోతులోకి దూకేశారు. ఈ దంపతులను రాహుల్, జాన్వీలుగా గుర్తించారు. రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లాలోని గోరంఘాట్ వంతెనపై ఈ ఘటన జరిగింది. ఈ రైలు వంతెనపై నిలబడిన ఈ దంపతులు.. ఫోటో షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.