శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2016 (14:50 IST)

పూణెలో మహిళా టెక్కీపై దారుణ హత్య.. కత్తితో పొడిచి పారిపోయిన అగంతకుడు

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. మహిళా టెక్కీ హత్యకు గురైంది. ఆమెను 23 ఏళ్ళ అంతారా దాస్‌‌గా గుర్తించారు. కోల్‌కతాకు చెందిన ఈమె శుక్రవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన ఆఫీసులో డ్యూటీ ముగించుకుని ఇం

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. మహిళా టెక్కీ హత్యకు గురైంది. ఆమెను 23 ఏళ్ళ అంతారా దాస్‌‌గా గుర్తించారు. కోల్‌కతాకు చెందిన ఈమె శుక్రవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో తన ఆఫీసులో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. ఓ దుండగుడు కత్తితో ఆమెను వెంబడించాడు. తనను రక్షించాలంటూ అంతారాదాస్ పరుగెత్తగా.. ఆ దుండగుడు ఒక చోట ఆపి ఆమెతో వాగ్వాదానికి దిగాడని.. ఒక దశలో కత్తితో ఆమె మెడ, చేతిపై తీవ్రంగా గాయపరచి పరారయ్యాడు.
 
ఆ తర్వాత స్థానికులు ఆ మహిళా టెక్కీని గుర్తించి... అంతారా దాస్‌ను దగ్గరిలోని ధన్వంతరి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు. అంతారా దాస్ ఐడెంటిటీ కార్డు ఆధారంగా పోలీసులు ఆమె తలిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.