1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (09:54 IST)

పంజాబ్ రాష్ట్రంలో మారిన ప్రభుత్వం పనివేళలు.. టైమింగ్స్ ఏంటంటే...

Bhagwant Mann
పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పని వేళలను మార్చారు. ఈ మార్పుల కారణంగా ఇక నుంచి ప్రతి రోజూ ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు పని చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు మే 2వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు టైమింగ్స్ మారుస్తున్నట్టు తెలిపారు.
 
వేసవికాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇలా చేయడం వల్ల విద్యుత్ లోడ్ 300 నుంచి 350 మెగావాట్లకు తగ్గుతుందని తెలిపారు. తాను కూడా ఇక నుంచి ఉదయం 7.30 గంటలకే కార్యాలయానికి వస్తానని తెలిపారు. 
 
కాగా, గత ఎన్నికల్లో పంజాబ్ రాష్ట్ర ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టంకట్టిన విషయం తెల్సిందే. దీంతో ఆప్ నేత, సినీ హాస్య నటుడైన భగవంత్ మాన్ సింగ్‍కు ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత అరవిందే కేజ్రీవాల్ అవకాశం ఇచ్చారు.