గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 మే 2022 (18:47 IST)

వెంటపడిన వీధి కుక్కలు - బోరుబావిలో పడిన బాలుడు

borewell
వీధి కుక్కలు వెంటపడటంతో వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగుపెట్టిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు 100 అడుగుల లోతైన బోరు బావిలో పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఆ బాలుడిని ప్రాణాలతో రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని హోషియాపూర్ జిల్లా గడ్డివాలా సమీపంలోని బరంపూర్ గ్రామంలో జరిగింది.
 
ఈ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడిని వీధి కుక్కలు తరుముకున్నాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు బాలుడు పరుగుపెట్టాడు. ఈ క్రమంలో జూట్ బ్యాగుతో కప్పివున్న బోరు బారిపై కాలు పెట్టాడు. అతని బరువుకు ఆ బ్యాగు చిరిగిపోవడంతో బావిలోపడిపోయాడు. 
 
సమాచారం అందుకున్న వెంటనే కమిషనర్‌తో పాటు జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందం సభ్యులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చెపట్టారు. 100 అడుగుల లోతులో పడిన బాలుడిని ప్రాణాలతో రక్షించేందుకు దానికి సమాంతరంగా పెద్ద గొయ్యిని తవ్వుతున్నారు. అలాగే, బాలుడికి ప్రాణవాయువును పైపుల ద్వారా అందిస్తూ, అతని పరిస్థితిని పర్యవేక్షించేందుకు బోరులో కెమెరాలను కూడా అమర్చారు.