శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2017 (13:50 IST)

ఆర్కే నగర్‌ ఎన్నికల సర్వే-పుదియ తలైమురై టీవీపై ప్రసారాలు బంద్.. తెలుగోడే టాప్..!?

ఆర్కే నగర్ ఎన్నికలు ఇంకా ప్రారంభం కాకముందే.. ఉప ఎన్నికల్లో తెలుగోడే టాప్‌లో నిలిచారు. అంటే ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న పన్నీర్ సెల్వం గ్రూపులోని మధుసూదన్ వైపే ఆ నియోజక వర్గ ప్రజలున్నారని తా

ఆర్కే నగర్ ఎన్నికలు ఇంకా ప్రారంభం కాకముందే.. ఉప ఎన్నికల్లో తెలుగోడే టాప్‌లో నిలిచారు. అంటే ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న పన్నీర్ సెల్వం గ్రూపులోని మధుసూదన్ వైపే ఆ నియోజక వర్గ ప్రజలున్నారని తాజా సర్వేలో తేలిపోయింది. ఆర్కేనగర్ ఎన్నికల ఫలితాలపై పుదియ తలైమురై టీవీ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ వివరాలను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 
 
ఈ సర్వేలో ఆర్కే నగర్ నియోజక వర్గ ప్రజలు మధుసూదనన్‌కే పట్టం కట్టారని, ఆయనే గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని టీవీ సర్వే ద్వారా తెలిపింది. రెండో స్థానంలో డీఎంకే, మూడో స్థానంలో టీటీవీ దినకరన్, నాలుగో స్థానంలో బీజేపీ, ఐదో స్థానంలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఉన్నారని సర్వే ద్వారా వెల్లడైంది. కానీ ఈ వివరాలను బహిర్గతం చేసిన పుదియ తలైమురై టీవీ కార్యాలయంపై తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గానికి చెందిన సర్కారు బంద్ చేసింది. 
 
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ ఓడిపోతారని ఓ టీవీ చానల్ సర్వే విడుదల చెయ్యడంతో కేబుల్ ప్రసారాలు కట్ చేశారు. అంతేగాకుండా శనివారం నుంచి పుదియ తలైమురై టీవీ ఛానల్ ప్రసారాలను తమిళ సర్కారు నిలిపివేసింది. ఇదే సర్వేలో విజయ్ కాంత్ కు చెందిన అభ్యర్థి చివరి స్థానంలో ఉన్నాడని వెలుగు చూసింది.