ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2017 (12:03 IST)

రాజస్థాన్‌లో దారుణం : నదిలో పడిన బస్సు... 30 మంది జలసమాధి (వీడియో)

రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని దుబి ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వంతెన పైనుంచి నదిలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 30 మంది జలసమాధి కాగా, మరో 15 మంది వర

రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని దుబి ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వంతెన పైనుంచి నదిలో బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 30 మంది జలసమాధి కాగా, మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్టీరింగ్ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
2010, మార్చిలో సవాయ్ మాధోపూర్‌లోని మోరెల్ నదిలో బస్సు పడిపోవడంతో 26 మంది చనిపోయిన విషయం విదితమే. ఈ మృతుల్లో 23 మంది విద్యార్థులు ఉన్నారు. మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.