సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (13:12 IST)

భారత క్రికెటర్ తాత ఆత్మహత్య

భారత యువ క్రికెటర్ తాత ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన పేరు సంకోఖ్ సింగ్. వయసు 84 యేళ్లు. ఆ భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా. రెండురోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆయన ఆదివారం శవమై కనిపించారు.

భారత యువ క్రికెటర్ తాత ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన పేరు సంకోఖ్ సింగ్. వయసు 84 యేళ్లు. ఆ భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా. రెండురోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆయన ఆదివారం శవమై కనిపించారు. సంతోఖ్‌ సింగ్‌ మృతదేహాన్ని స్థానిక సబర్మతీ నదీ తీరంలోని ఓ వంతెన వద్ద పోలీసులు గుర్తించారు. సంతోఖ్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావించి కేసు నమోదు చేశారు. 
 
సంతోఖ్‌సింగ్‌ ఉత్తరాఖండ్‌లో‌ని ఉధంసింగ్‌నగర్‌ జిల్లా కిచ్చా పట్టణంలో నివసిస్తున్నాడు. మనవడు బుమ్రాను చూసి ఆశీర్వదించడమే తన చివరి కోర్కె అంటూ డిసెంబరు ఒకటో తేదీన ఉధంసింగ్‌ నగర్‌ నుంచి అహ్మదాబాద్‌లోని కూతురు రాజీందర్‌కౌర్‌ బుమ్రా ఇంటికి వచ్చాడు. అయితే బుమ్రాను చూసేందుకు అతడి తల్లి దల్జీత్‌కౌర్‌ తన తండ్రిని అనుమతించలేదని రాజీందర్‌ కౌర్‌ ఆరోపించారు. 
 
దల్జీత్‌కౌర్‌ ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. 'కనీసం అతడి (జస్పీత్‌ బుమ్రా) ఫోన్‌ నెంబర్‌ ఇస్తే నా తండ్రి బుమ్రాతో మాట్లాడేవాడు. కానీ ఆ నెంబర్‌ ఇచ్చేందుకు కూడా ఆమె (దల్జీత్‌ కౌర్‌) నిరాకరించింది. దాంతో నా తండ్రి హృదయం బద్ధలైంది. గత శుక్రవారం ఇంటిని వీడిన ఆయన తిరిగి రాలేదు' అని రాజీందర్‌ తెలిపారు. దాంతో ఈ నెల 8న రాజీందర్‌ కౌర్‌ వస్త్రాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేస్తుండగానే ఈ విషాదకర వార్తను వినాల్సి వచ్చిందని ఆమె బోరున ఏడుస్తూ చెప్పుకొచ్చింది.