మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 మే 2020 (13:26 IST)

ఘుమఘుమలాడే మిడతల బిర్యానీ.. సైడ్ డిష్ లోకస్ట్-65 ఎక్కడ?

Locust Briyani
ఉత్తరాది భారత దేశంలో మిడతల దాడి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ మిడతలు ఉత్తరాది రెస్టారెంట్లలో ఆహారంగా మారుతున్నాయి. అసలే కరోనా కారణంగా చికెన్‌కు తాకాలంటే జనం జడుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రెస్టారెంట్లు మాత్రం మిడతల బిర్యానీ, మిడతల ఫ్రై, మిడతల గ్రేవీ, లోక్టస్ 65 వంటి వంటకాలను అమ్ముతున్నాయి. 
 
గత కొన్ని రోజులుగా పలు కోట్ల మిడతలు పంట పొలాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ మిడతలను తొలగించే క్రమంలో ప్రభుత్వాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని థార్, జైపూర్ వంటి ప్రాంతాల్లో ని రెస్టారెంట్లలో మిడతల బిర్యానీ, గ్రేవీ, లోక్టస్ 65 వంటి వంటకాలు తయారు చేసి అమ్ముతున్నారు. 
 
వీటిల్లో ప్రోటీన్లు వుండటంతో పాటు రాజస్థాన్ ప్రజలు లొట్టలేసుకుని తింటున్నారు. అయితే మిడతలను వండేందుకు ముందు వాటి రెక్కలను పూర్తిగా తొలగించాలని.. ఆపై పసుపుతో శుభ్రం చేయాలని వాటిని వండే మాస్టర్లు చెప్తున్నారు.