ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2019 (11:38 IST)

అధికార నివాసాన్ని ఖాళీ చేసిన రంజన్ గొగోయ్

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నిర్ణీత గడువుకు ముందే తన అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. పదవీ విరమణ తర్వాత నెల రోజులపాటు ఆయన తన అధికార నివాసంలో ఉండేందుకు అవకాశం ఉన్నా … ముందుగానే ఖాళీ చేశారు. 
 
5 కృష్ణ మీనన్‌ మార్గ్‌లో తనకు కేటాయించిన అధికార నివాసం నుంచి మాజీ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఖాళీ చేశారు. పదవీ విరమణ చేసిన మూడు రోజుల్లోనే అధికార నివాసాన్ని ఖాళీ చేసిన మొట్ట మొదటి CJIగా జస్టిస్‌ గొగోయ్‌ నిలిచారు.