Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

బీజేపీలోకి రాయపాటి..? బాబుకు వరుస షాకులు...

Written By ఎం
Updated: బుధవారం, 17 జులై 2019 (20:22 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ... తెలుగు రాష్ట్రాల్లోనూ బలాన్ని పెంచుకునేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. 
 
ఈ క్రమంలోనే అసంతృప్తి నేతలను, సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాయపాటిని బీజేపీ నేత రాం మాధవ్ కలిశారు. రాయపాటి ఇంటికి వెళ్లి మరీ బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. 
 
గుంటూరు జిల్లాలో రాయపాటి కుటుంబానికి బలం ఎక్కువే. ఆయన కనుక బీజేపీలో చేరితే... ఆయన మద్దతుదారులంతా బీజేపీలోకి వచ్చి చేరే అవకాశం ఉంది.  దాంతో పార్టీని ప్రతిష్టం చేసుకోవచ్చని బీజేపీ యోచిస్తోంది. రాం మాధవ్ ఇచ్చిన ఆఫర్ పై రాయపాటి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

రెండు రోజుల్లో ఢిల్లీ వచ్చి పార్టీ పెద్దలను కలుస్తానని రాయపాటి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. రాం మాధవ్ తో భేటీ తర్వాతి రోజే.. రాయపాటి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తనకున్న ఇబ్బందులను చంద్రబాబుకి వివరించినట్లు సమాచారం.

అన్నీ చూడండి

Vijay Deverakonda: చారిత్రకథాంశంగా విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ డేట్ ప్రకటన

ఈశ్వర్ రాచి రాజు నటిస్తున్న చిత్రంలో నర్తకి పాత్రలో పూజిత పొన్నాడ

Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్‌ 418 రిలీజ్ డేట్ ఫిక్స్

Babumohan: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రం ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా

తర్వాతి కథనం
Show comments