గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (16:43 IST)

తగ్గిన గ్యాస్ ధర!

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త! అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా వంటగ్యాస్ ఉపయోగిస్తున్న వారికి ఊరట లభించింది. తాజాగా గ్యాస్ సిలిండర్ ధర భారీగా దిగొచ్చింది.
 
గ్యాస్ ధరలు ప్రతినెలా మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని క్రూడ్ ధరలు సహా రూపాయి మారక విలువపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది.

అందుకే గ్యాస్ కంపెనీలు ప్రతినెల ఒకటో తేదిన గ్యాస్ సిలిండర్ ధర మారుస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 214 తగ్గింది. అంటే ప్రస్తుతం వంటగ్యాస్ ధర రూ. 583 నుంచి ప్రారంభమవుతుంది.

ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ. 336 క్షీణించి ప్రారంభ ధర రూ. 988కి చేరింది. తగ్గిన కొత్త రేటు తక్షణం అమల్లోకి రానున్నట్లు సమాచారం.