శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:10 IST)

మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన రెహ్మాన్..ఎందుకో తెలుసా?

సర్వీస్ ట్యాక్స్ బకాయి ఉన్నారంటూ జీఎస్టీ కమిషనర్.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కు నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ రెహ్మాన్  మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

తన పాటలపై సినీ నిర్మాతలకు పేటెంటు హక్కులు ఇచ్చిన తర్వాత దానిపై ఎటువంటి పన్నులు చెల్లించాల్సి ఉన్నా వారిదే బాధ్యతని స్పష్టం చేశాడు. తనకు నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమని కోర్టుకు తెలిపాడు.

పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి రెహ్మాన్‌కు పంపిన నోటీసుపై మార్చి 4వ తేదీ వరకు ఎటువంటి చర్య తీసుకోవద్దని ఆదేశిస్తూ స్టే విధించారు.

ఈ పిటిషన్ పై రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని జీఎస్టీ కమిషనర్ ను ఆదేశించారు.