సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (14:19 IST)

లఖింపుర్ ఖేర్ ఘటన : మరో జర్నలిస్టు మృతి - మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని ల‌ఖింపుర్ ఖేర్‌లో ఆదివారం కేంద్ర మంత్రి తనయుడు కాన్వాయ్ కారు దూసుకెళ్ల‌డంతో న‌లుగురు మృతిచెందింది. ఆ త‌ర్వాత జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో మ‌రో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘర్షణల్లో గాయపడిన ఓ జ‌ర్న‌లిస్టు సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. 
 
అయితే, ల‌ఖింపుర్ ఖేర్ ఘ‌ట‌న‌లో మృతిచెందిన న‌లుగురు రైతు కుటుంబాల‌కు యూపీ ప్ర‌భుత్వం ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది. ఒక్కొక్క మృతుడి కుటుంబానికి రూ.45 ల‌క్ష‌లు అందజేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. 
 
అలాగే, ల‌ఖింపుర్ ఖేర్‌లో గాయ‌ప‌డ్డ వారికి ఒక్కొక్క‌రికి 10 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. రైతులు ఇచ్చే ఫిర్యాదు మేర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌నున్న‌ట్లు ఏడీజీ ప్ర‌కాంత్ కుమార్ తెలిపారు. ల‌ఖింపుర్ ఖేర్ హింస‌పై రిటైర్డ్ హైకోర్టు జ‌డ్జితో ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.