శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (09:39 IST)

ఆస్తి కోసమే నా మొగుడ్ని చంపేశా : అపూర్వా శుక్లా

వైవాహిక జీవితంలో ఏర్పడిన కలలతో పాటు.. ఆస్తి కోసమే తన భర్తను చంపేసినట్టు రోహిత్ శేఖర్ తివారీ భార్య అపూర్వా శుక్లా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్‌గా ఉన్న ఎన్డీ తివారీ కుమారుడే ఈ రోహిత్ తివారీ. అపూర్వ శుక్లా అనే మహిళను ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వారి మధ్య ఏర్పడిన కలహాల కారణంగా రోహిత్ తివారీ చనిపోయాడు. దీనిపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
దీనిపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో రోహిత్‌ది హత్యేనని తేలింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న రోహిత్‌ భార్య అపూర్వను అరెస్టు చేశారు. ముఖంపై దిండుతో ఒత్తి రోహిత్‌ను హత్య చేశారన్న అభియోగాలపై ఆమెను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. 
 
దీనిపై పోలీసులు స్పందిస్తూ, 'భార్యాభర్తల మధ్య అర్థరాత్రి ఒంటిగంటకు వారిమధ్య తలెత్తిన గొడవ తీవ్రరూపం దాల్చింది. రోహిత్‌ మద్యం మత్తులో ఉన్న సమయంలో అపూర్వ అతడిని హతమార్చింది. ఈ హత్యలో ఆమెకు ఎవరూ సహకరించలేదు. తనంతట తానే స్వయంగా అతడికి ఊపిరాడకుండా చేసి చంపింది. ఆ తర్వాత ఆధారాలన్నింటినీ మాయం చేసింది. కేవలం గంటన్నర సమయంలో ఆమె ఈ పనులన్నీ పూర్తి చేసింది. త్వరలోనే ఆమెను కోర్టు ముందు హాజరుపరుస్తాం' అని కేసుకు సంబంధించి విషయాలు వెల్లడించారు.