శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

జూన్ ఒకటో తేదీ నుంచి అనేక నిబంధనల్లో మార్పులు... ఏంటవి?

driving licence
నిత్యం జీవితంపై ప్రభావం చూపే బోల్డన్ని నిబంధనల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నిబంంధనల్నీ అమల్లోకి రానున్నాయి. వీటిలో గ్యాస్ వినియోగం, బ్యాంకు సెలవులు, ఆధార్ అప్‌‍డేట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉన్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి మార్పులు చోటుచేసుకోనున్న వాటిపై ఓ లుక్కేద్దాం.. 
 
జూన్ ఒకటో తేదీ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో అతిపెద్ద మార్పు కనిపించనుంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణా సంస్థలో ఇకపై డ్రైవింగ్ లైసెన్స్‌ను మంజూరు చేస్తాయి. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీచేసింది. కాలుష్య నివారణలో భాగంగా దాదాపు 9 లక్షల ప్రభుత్వ వాహనాలను దశలవారీగా తుక్కుగా (స్క్రాప్)గా మార్చనున్నారు. 
 
అలాగే, అతివేగంగా వాహన నడిపితే రూ.1000 నుంచి రూ.2 వేల వరకు అపరాధం విధిస్తారు. పిల్లలు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.25 వేల వరకు జరిమానా. విధిస్తారు. దీనికి అదనంగా వాహన యజమాని రిజిస్ట్రేషన్  కూడా రద్దు చేస్తారు. వాహనం నడిపిన మైనర్‌కు 25 యేళ్శు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ జారీచేయకుండా నిషేధం విధిస్తారు. 
 
ఎల్పీజీ సిలిండర్ ధరలను గ్యాస్ కంపెనీలు సవరిస్తాయి. మే నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. జూన్ నెలలో మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి పెట్రోల్, డీజల్ ధరలను కూడా రోజువారీగా సవరించే అవకాశం ఉంది. అలాగే, జూన్ నెలలో అన్ని బ్యాంకులకు కనీసం పది రోజుల పాటు సెలవులు రానున్నాయి. వీటిలో ఆదివారం, శనివారాలు కూడా ఉన్నాయి.