హిందు అనేది ఓ మతమే కాదు : జగ్గీవాసుదేవ్ సంచలన వ్యాఖ్యలు
నిత్యం ప్రశాంతవదనంతో కనిపించి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తాజాగా హిందూమతం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలుచేశారు. ఇవి ప్రకంపనలు రేపుతున్నాయి. 'హిందూ' అనేది ఓ మతమే కాదన్నారు. హిందుస్థాన్ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువేనన్నారు.
ఆయన ఓ ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూమతం ఉందని చెప్పడానికి ఏ విధమైన ఆధారాలు లేవన్నారు. హిందూమతం గురించి ప్రత్యేకంగా ఏ పుస్తకంలోనూ రాయలేదన్నారు. అది కేవలం భౌగోళిక గుర్తింపు మాత్రమేనన్నారు. అందువల్ల నమ్మకాలతో సంబంధం లేకుండా ఈ ప్రాంతంలో జన్మించినవారంతా హిందువులేనని అన్నారు.