సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 12 నవంబరు 2016 (13:52 IST)

ఉప్పు కొరతపై వదంతులు... రూ.800 నుంచి రూ.1000 వరకు పలికిన బస్తా ధర..

రూ.400 ఉన్న బస్తా ఉప్పును రూ.800 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారని.. అటు వినియోగదారులు కూడా ఆలస్యం చేస్తే ఉప్పు దొరకదేమో అన్న భయంతో అధిక ధరకే ఉప్పు సంచులు కొనుక్కుపోతున్నారు. ఉప్పు కొరతపై వదంతులు ఉత్త

రూ.400 ఉన్న బస్తా ఉప్పును రూ.800 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారని.. అటు వినియోగదారులు కూడా ఆలస్యం చేస్తే ఉప్పు దొరకదేమో అన్న భయంతో అధిక ధరకే ఉప్పు సంచులు కొనుక్కుపోతున్నారు. ఉప్పు కొరతపై వదంతులు ఉత్తరాది నుంచి హైదరాబాద్ చేరాయి. ఉప్పు కృత్రిమ కొరత సృష్టించిన వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. 
 
హైదరాబాద్‌లో అర్థరాత్రి కిలో ఉప్పు ప్యాకెట్‌ను రూ.300 నుంచి 500లకు అమ్మారు. పాతబస్తీతో పాటు బోరబండ, యూసుఫ్‌గూడ‌లోని పలు కిరాణా షాపులకు జనం బారులు తీరారు. సంగారెడ్డి జిల్లాలో పలువురు వినియోగదారులు ఓ కిరాణ దుకాణం నుంచి డబ్బు చెల్లించకుండానే ఉప్పును లాక్కొని పారిపోయారు. వినియోగదారులు వాగ్వివాదానికి దిగితే అప్పుడు అసలు ధరకు అమ్ముతున్నారు. 
 
అయితే ఉప్పు కొరత ఏర్పడిందన్న వదంతులు నమ్మొద్దని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి కోరారు. సోషల్ మీడియాలో ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని వెల్లడించారు. వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప్పును బ్లాక్‌లో అమ్మాలని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.