శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (09:51 IST)

ఆన్‌లైన్‌లో అన్నాడీఎంకే మహిళా ఎంపీ అశ్లీల ఫోటో... ఢిల్లీ పోలీసుల కేసు

అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పను అశ్లీలంగా చూపిస్తూ ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారు. ఇది వైరల్‌గా మారింది. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకమైన పోస్టులత

అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్పను అశ్లీలంగా చూపిస్తూ ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టారు. ఇది వైరల్‌గా మారింది. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకమైన పోస్టులతో తనను టార్గెట్ చేయడంపై... శశికళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 
 
'ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేశాం. సైబర్ సెల్ బృందం దీనిపై దర్యాప్తు చేపట్టింది. పార్లమెంటు సభ్యురాలి ఫోటోలను మార్ఫింగ్ చేసిన వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా సంబంధిత వైబ్‌సైట్లకు ఆదేశాలు జారీ చేశాం' క్రైం విభాగం డీసీపీ మధుర్ వర్మ పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న శశికళను అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించిన విషయం తెల్సిందే.