శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (10:50 IST)

జయ ఫోటోలు బయటపెడితే ఆత్మహత్య చేసుకుంటా.. శశికళ.. చెప్పేసిన దివాకరన్

దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లేముందు సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఆమె మేనల్లుడు జయానంద్ దివా

దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లేముందు సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఆమె మేనల్లుడు జయానంద్ దివాకరన్ పేర్కొన్నారు. దివాకరన్ తాజా వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో మరోమారు కలకలం రేగింది.
 
అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న జయలలిత ఫొటోలు కానీ వీడియోలు కానీ బయటపెడితే తాను ఆత్మహత్య చేసుకుంటానని శశికళ హెచ్చరించారని దివాకరన్ తెలిపారు. ఈ విధంగా తమ కుటుంబ సభ్యులను హెచ్చరించిన తర్వాతే చిన్నమ్మ జైలుకు వెళ్లారన్నారు. 
 
జయలలిత ఫొటోలు బయటకు వచ్చినా, ఆమె అంతిమ ఘడియల ముందు ఆస్పత్రిలో జరిగిన వ్యవహారం బయటకు పొక్కినా, జయ మరణంపై విచారణ జరిపినా తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారని దివాకరన్ పేర్కొన్నారు.