శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:05 IST)

సౌదీ అరేబియా మరో సంచలన నిర్ణయం.. 20 దేశాల ప్రయాణికులపై నిషేధం

సౌదీ అరేబియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో ఇండియాను కూడా చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ కఠిన నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదంటూ సౌదీ అధికారులు వెల్లడించారు. ఆ 20 దేశాల్లో ఉన్న సౌదీ పౌరులు, ప్రభుత్వ అధికారులకు ఈ నిషేధం వర్తించదని సౌదీ మినహాయింపు ఇచ్చింది.

అలాగే సౌదీలోనూ కరోనా నియంత్రణకు పలు చర్యలు తీసుకుంటుంది. కరోనా నిబంధనలను పాటించని వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి తాఫిక్ అల్ రబియా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు విధిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.