ఆదివారం, 13 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 మార్చి 2025 (14:34 IST)

యువకుడికి బడితపూజ చేసిన వృద్ధుడు .. ఎందుకో తెలుసా? (Video)

beat
ఇటీవలికాలంలో రీల్స్ చేయడం పెరిగిపోయింది. ఫోన్ చేతిలో ఉంటే చాలు.. యువత రీల్స్ షూట్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. కొన్నిసార్లు రీల్స్ చిత్రీకరణలో ప్రాణాలు పోగొట్టుకోవడం, కొన్ని రీల్స్ వికటించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ కుర్రోడు రీల్ షూట్ చేసే ప్రయత్నంలో బడిత పూజ చేయించుకున్నాడు. 
 
ఇంతకీ ఏం జరిగిందో పరిశీలిద్దాం... ఓ కుర్రాడు, ఓ అమ్మాయి పక్కన నిల్చుని టీజ్ చేస్తున్నట్టుగా నటించాడు. ఇదంతా రీల్స్‌లో భాగమే. కానీ, అదే సమయంలో కారులో అటుగా వచ్చిన ఓ వృద్ధ దంపతులు ఆ అబ్బాయి నిజంగానే అమ్మాయిని ఏడిపిస్తున్నాడని భావించి ఆగ్రహానికి గురయ్యారు. 
 
వెంటనే ఆ పెద్దాయన కారు దిగి, తన కారులో నుంచి ఓ కర్ర తీసుకుని కుర్రాడుని చితకబాదాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఉతికారేశాడు. దీంతో కుర్రాడికి ఆ వృద్ధుడు బడిత పూజ చేయడమే ఓ రీల్ అయింది. చుట్టూ ఉన్న వాళ్లు తమ సెల్ ఫోనులో ఈ తతంగాన్ని వీడియో తీశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.