శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (14:30 IST)

వరకట్నం ఇవ్వలేదని.. భార్య తాగే నీటిలో యాసిడ్ కలిపేసిన భర్త.. ఆ తర్వాత?

వివాహ సమయంలో చెప్పిన మొత్తాన్ని వరకట్నంగా ఇవ్వలేదనే కారణంతో ఓ కిరాతకుడు కట్టుకున్న భార్య తాగే నీటిలో యాసిడ్ కలిపేశాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కేరళలోని కోళికోట్టైకి చెందిన జావే

వివాహ సమయంలో చెప్పిన మొత్తాన్ని వరకట్నంగా ఇవ్వలేదనే కారణంతో ఓ కిరాతకుడు కట్టుకున్న భార్య తాగే నీటిలో యాసిడ్ కలిపేశాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కేరళలోని కోళికోట్టైకి చెందిన జావేద్, ఫసీనా దంపతులు బెంగళూరులో నివసిస్తున్నారు.

ఫసీనా వద్ద వరుడి తరపు వారు పెళ్లి సమయంలో ఒకటిన్నర లక్ష రూపాయల నగదు, బంగారం అడిగారు. ఫసీనా తల్లిదండ్రులు అడిగినంత ఇవ్వలేకపోయారు. దీంతో అనేక సార్లు వరకట్నం తేవాల్సిందిగా ఫసీనాను జావేద్ వేధించాడు.
 
ఈ నేపథ్యంలో ఫసీనా భోజనం చేస్తుండగా.. గ్లాసులో కొన్ని నీళ్ళివ్వాల్సిందిగా భర్తను కోరింది. భర్త కూడా నీళ్లు తెచ్చాడు. భార్యకిచ్చాడు. అయితే ఆ నీటిలో యాసిడ్ కలిపాడు. దీన్ని తాగిన ఫసీనా రక్తంతో కూడిన వాంతులు చేసింది. ఆపై ఫసీనాను ఆమె బంధువులు ఆస్పత్రికి తరలించారు. 
 
తాగిన నీటిలో యాసిడ్ కలపడంతో ఆమె రక్తపు వాంతులు చేసిందని వైద్యులు నిర్ధారించారు. యాసిడ్ తాగడంతో ఆమె అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  జరుపుతున్నారు.