గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 21 జులై 2017 (14:24 IST)

మంచు కొండను అగ్ని పర్వతంలా మార్చిన రేప్... నిందితులు కొట్టుకు చస్తున్నారు...

ఎప్పుడూ చల్లగా ఆహ్లాదాన్నిచ్చే ప్రాంతం సిమ్లా. సిమ్లాలో అడుగుపెట్టినవారికి పెట్టనివారికీ ఆ పేరు చెబితే చాలు చల్లగా అనిపిస్తుంది. ఇపుడలాంటి సిమ్లా అగ్నిపర్వతంలా మారింది. దీనికి కారణం ఓ రేప్ ఘటన. వివరాల్లోకి వెళితే... ఇటీవల సంపన్న వర్గానికి చెందిన ఆరుగ

ఎప్పుడూ చల్లగా ఆహ్లాదాన్నిచ్చే ప్రాంతం సిమ్లా. సిమ్లాలో అడుగుపెట్టినవారికి పెట్టనివారికీ ఆ పేరు చెబితే చాలు చల్లగా అనిపిస్తుంది. ఇపుడలాంటి సిమ్లా అగ్నిపర్వతంలా మారింది. దీనికి కారణం ఓ రేప్ ఘటన. వివరాల్లోకి వెళితే... ఇటీవల సంపన్న వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఓ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. సామూహిక అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఆ బాలికను అత్యంత దారుణంగా హతమార్చారు. 
 
సిమ్లాలోని కొత్కాయ్ పట్టణానికి చెందిన ఆ బాలిక ఉదంతాన్ని, ఆమెపై జరిగిన దారుణం, హత్యను చూసిన స్థానికులకు గుండె చెరువైంది. పైగా గ్యాంగ్ రేప్ చేసినవారిని కాపాడేందుకు పోలీసులు సహకరిస్తున్నారన్న అనుమానం వారిలో కలిగింది. అంతే... ఈ విషయంపై పోలీసులను నిలదీయడం మొదలుపెట్టారు. 
 
ఈ క్రమంలో పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలులో పెట్టినప్పటికీ వారికి రాచమర్యాదలు జరుగుతున్నట్లు గమనించి స్థానికులు ఆందోళనకు దిగారు. ఇదిలావుండగానే పోలీసుల కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజేందర్ సింగ్ మరో నిందితుడు సూరత్‌తో గొడవపడి అతడిని హత్య చేశాడు. ఈ సంగతి బయటకు రావడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. 
 
2 వేల మందికి పైగా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి పోలీసు స్టేషనుకు నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పడంతో పాఠశాలలు, దుకాణాలు, కార్యాలయాలను మూసివేశారు. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు, హిమాచల్ ప్రదేశ్ సర్కారును కేసును సీబీఐ విచారణకు అప్పజెప్పాలని ఆదేశించింది. రాష్ట్ర గవర్నర్ సైతం విషయంపై సీరియస్ అయ్యారు.