మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 8 ఆగస్టు 2023 (22:59 IST)

IIJS 2023లో ‘శ్రీ అనంత పద్మనాభస్వామి’ కళాఖండంను ఆవిష్కరించిన శివ్ నారాయణ్ జ్యువెలర్స్

Anantha padmanabha
దేశం గర్వించదగ్గ జువెల్లర్  శివ్  నారాయణ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో (IIJS) 2023లో సరికొత్త మాస్టర్ పీస్ 'శ్రీ అనంత పద్మనాభస్వామి'ని ఆవిష్కరించింది. దీనిని భీమా జ్యువెలర్స్, తిరువనంతపురం చైర్మన్ డాక్టర్ బి. గోవిందన్‌కు అంకితం చేశారు. శివ్  నారాయణ్ జ్యువెలర్స్ 8 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్ సాధించిన తరువాత ఈ అద్భుతమైన కళాఖండం తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఈ ఆభరణం  కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న అద్భుతమైన విగ్రహం నుండి ప్రేరణ పొందినది. 
 
శ్రీ అనంత పద్మనాభస్వామి ఆభరణం 8 అంగుళాల ఎత్తు మరియు 18 అంగుళాల పొడవు కలిగి ఉంటుంది. 2 నెలల పాటు 32 మంది ప్రతిరోజూ 16 గంటలు పని చేసి చేతితో తయారు చేసిన ఈ పారాగాన్ ఆభరణం ఆశ్చర్యపరిచే విధంగా 2.8 కిలోల బరువు వుంది. మొత్తం 500 క్యారెట్ల బరువు కలిగిన దాదాపు 75,000 అధిక-నాణ్యత కలిగిన వజ్రాలతో అలంకరించబడిన శ్రీ అనంత పద్మనాభస్వామి రూపు చూడతగ్గ రీతిలో ఉంటుంది. ఈ సంచలనాత్మక సృష్టితో తమ 9వ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్స్‌కు చేరువయ్యారు. చైర్మన్- శ్రీ కమల్ కిషోర్ అగర్వాల్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ తుషార్ అగర్వాల్ మార్గదర్శకత్వంలో రూపొందించబడిన ఈ ఆభరణం మానవ సృజనాత్మకత యొక్క ప్రకాశం మరియు లగ్జరీ ఆభరణాల యొక్క కాలానుగుణ ఆకర్షణకు నిజమైన నిదర్శనం. 
image
ఈ సందర్భంగా శివ్ నారాయణ్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ అగర్వాల్ మాట్లాడుతూ, “శ్రీ అనంత పద్మనాభస్వామి మన వారసత్వం మరియు ఆభరణాల తయారీలో ఉన్న అంకితభావానికి సంబంధించిన వేడుక. డా. బి. గోవిందన్ కోసం ఈ అద్భుతమైన ఆభరణం సృష్టించటం ఒక గౌరవంగా భావిస్తున్నాము. ఆభరణాల పరిశ్రమకు ఆయన అందించిన అపారమైన సహకారం మనందరికీ స్ఫూర్తిగా నిలిచింది" అని అన్నారు.